Na Cheli Rojave (From "Roja") - A. R. Rahman
Tekst piosenki
Album: Best of A.R. Rahman - Na Cheli Rojave (2015)
TEKST PIOSENKI NA CHELI ROJAVE (FROM "ROJA")W WYKONANIU A. R. RAHMAN
నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే
కళ్ళల్లో నీవే కన్నీటా నీవే
కనుమూస్తే నీవే యదలో నిండేవే
కనిపించవో అందించవో తోడు
నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే
గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం
గులాబీలు పూసినా చిలిపి నవ్వు జ్ఞాపకం
అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం
మేఘమాల సాగితే మోహకథలు జ్ఞాపకం
మనసు లేకపోతే మనిషి ఎందుకంటా
నీవు లేకపోతే బతుకు దండగంటా
కనిపించవో అందించవో తోడు
నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే
కళ్ళల్లో నీవే కన్నీటా నీవే
కనుమూస్తే నీవే యదలో నిండేవే
కనిపించవో అందించవో తోడు
చెలియ చెంత లేదులే చల్ల గాలి ఆగిపో
మమత దూరమాయనే చందమామ దాగిపో
కురుల సిరులు లేవులే పూల వనం వాడిపో
తోడు లేదు గగనమా చుక్క లాగ రాలిపో
మనసులోని మాట ఆలకించలేవా
విడిపోని నీడై నిన్ను చేరనీవా
కనిపించవో అందించవో తోడు
నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే
కళ్ళల్లో నీవే కన్నీటా నీవే
కనుమూస్తే నీవే యదలో నిండేవే
కనిపించవో అందించవో తోడు.
NAJNOWSZE ALBUMY A. R. RAHMAN (75)
- Pokaż wszystkie