Baby He Loves You - Devi Sri Prasad
Tekst piosenki
Album: Aarya - 2 (Original Motion Picture Soundtrack) (2009)
TEKST PIOSENKI BABY HE LOVES YOUW WYKONANIU DEVI SRI PRASAD
ఛ… వాడికి నా మీద ప్రేమే లేదు హి డసంట్ లవ్ మి యు నో.
నో. హి లవ్స్ యు. హి లవ్స్ యు సో మచ్.
అవునా. ఎంత?
ఊ.ఎంతంటే...
ఆ. మొదటి సారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టి కోపమంత
మొదటి సారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టి ద్వేషమంత
మొదటి సారి నీకు ముదుపెట్టినప్పుడు జరిగినంత దోషమంత
చివరిసారి నీకు నిజం చెప్పినపుడు తీరినట్టి భారమంత
ఓ. ఇంకా.
హో.తెల్ల తెల్లవారి పల్లెటూరిలోన అల్లుకున్న వెలుగంత
పిల్ల లేగదూడ నోటికంటుకున్న ఆవు పాల నురగంత
హో.చల్ల బువ్వలోన నంజుకుంటు తిన్న ఆవకాయ కారమంత
పెళ్లి ఈడుకొచ్చి తుళ్ళి ఆడుతున్న ఆడపిల్ల కోరికంత
బేబీ హి లవ్స్ యు, హి లవ్స్ యు, హి లవ్స్ యు సో మచ్ ...
బేబీ హి లవ్స్ యు, హి లవ్స్ యు, హి లవ్స్ యు సో మచ్...
హే.అందమైన నీ కాలి కింద తిరిగే నేలకున్న బరువంత
నీలి నీలి నీ కళ్ళలోన మెరిసే నింగికున్న వయసంత
చల్లనైన నీ శ్వాసలోన తోణికే గాలికున్న గతమంతా
చుర్రుమన్న నీ చూపులోన ఎగసే నిప్పులాంటి నిజమంత
బేబీ హి లవ్స్ యు, హి లవ్స్ యు, హి లవ్స్ యు సో మచ్ …
బేబీ హి లవ్స్ యు, హి లవ్స్ యు, హి లవ్స్ యు సో మచ్...
హాయ్.పంటచేలలోని జీవమంత,
ఘంటసాల పాట భావమంత
పండగొచ్చినా పబ్బమోచ్చినా వంటశాలలోని వాసనంత
కుంభకర్ణుడి నిద్దరంత,
ఆంజనేయుడి ఆయువంత
కృష్ణ మూర్తిలో లీలలంత.
రామలాలి అంత
బేబీ హి లవ్స్ యు, హి లవ్స్ యు, హి లవ్స్ యు సో మచ్ …
బేబీ హి లవ్స్ యు, హి లవ్స్ యు, హి లవ్స్ యు సో మచ్...
పచ్చి వేప పుల్ల చేదు అంత,
రచ్చబండ పైన వాధనంత
అర్ధమైన కాకపోయినా భక్తికొద్ది విన్న వేదమంత
ఏటి నీటిలోని జాబిలంత,
ఏట ఏట వచ్చే జాతరంత
ఏకపాత్రలో నాటకాలలో నాటు గోలలంత
బేబీ హి లవ్స్ యు, హి లవ్స్ యు, హి లవ్స్ యు సో మచ్ …
బేబీ హి లవ్స్ యు, హి లవ్స్ యు, హి లవ్స్ యు సో మచ్...
అల్లరెక్కువైతే కన్నతల్లి వేసే మొట్టికాయ చనువంత
జల్లుపడ్డ వేళ పొంగి పొంగి పూసే మట్టిపూల విలువంత
హో.బిక్కు బిక్కు మంటు పరీక్ష రాసే పిల్లగాడి బెదురంత
లక్షమందినైన సవాలు చేసే ఆటగాడి పొగరంత
బేబీ హి లవ్స్ యు, హి లవ్స్ యు, హి లవ్స్ యు సో మచ్ …
బేబి.బేబీ హి లవ్స్ యు, హి లవ్స్ యు, హి లవ్స్ యు టూ మచ్
ఎంత దగ్గరైన నీకు నాకు మధ్య ఉన్న అంతులేని దూరమంత
ఎంత చేరువైన నువ్వు నేను కలిసి చేరలేని తీరమంత
ఎంత ఓర్చుకున నువ్వు నాకు చేసే జ్ఞాపకాల గాయమంత
ఎంత గాయమైన హాయిగానే మార్చే మా తీపి స్నేహమంత
బేబీ హి లవ్స్ యు, హి లవ్స్ యు, హి లవ్స్ యు సో మచ్
బేబీ హి లవ్స్ యు, హి లవ్స్ యు, ఐ లవ్ యు సో మచ్
NAJNOWSZE ALBUMY DEVI SRI PRASAD (56)
- Pokaż wszystkie